Baby: తెలుగు అమ్మాయిలకు బన్నీ రిక్వెస్ట్.. వైష్ణవిని లాగుతూ.. మీ వాళ్లకు ఇష్టం లేకున్నా ఆగొద్దంటూ!

దాదాపు నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న సినిమాల్లో 'బేబి' ఒకటి. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే బజ్‌ను ఏర్పరచుకోవడంతో పాటు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది. దీంతో టాలీవుడ్ టాప్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా టీమ్‌ను అభినందించేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అప్రిషియేషన్ మీట్ నిర్వహించింది. ఇందులో బన్నీ తెలుగు అమ్మాయిలపై మాట్లాడాడు. ఆ వివరాలు మీకోసం!

బేబిని తయారు చేసింది వీళ్లే:ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలు చేసిన చిత్రమే 'బేబి'. సాయి రాజేష్ రూపొందించిన ఈ మూవీలో నాగబాబు, వైవా హర్ష, లిరిషా, సాత్విక్ ఆనంద్, ప్రభావతి వర్మ, సీత కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Allu Arjun Invites Telugu Girls to The Film Industry At Baby Appreciation Meet

భారీ హిట్.. బన్నీతో ఈవెంట్:కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందిన 'బేబి' మూవీ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోరిక మేరకు చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో అప్రిషియేషన్ మీట్ నిర్వహించింది. దీన్ని చాలా తక్కువ మందితో నిడారంభరంగా జరిపారు. ఇందులో బన్నీ దాదాపు అరగంట మాట్లాడాడు.

అలాంటి సినిమానే బేబి అని:
బేబి అప్రిషియేషన్ మీట్‌లో అల్లు అర్జున్.. 'బేబి టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్. సినిమా చింపేశారు. నిజానికి లవ్‌లో పెయిన్ చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అప్పట్లో కాదల్ కొండేన్, 7/G బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి' సినిమాలు చూశాం. కానీ అలాంటివి తీయడమే కష్టం. కానీ, సాయి రాజేష్ గారు రియలిస్టిక్‌గా దీన్ని తీశారంటే చాలా గ్రేట్' అంటూ చెప్పుకొచ్చాడు.

Allu Arjun Invites Telugu Girls to The Film Industry At Baby Appreciation Meet

చాలా విషయాలు నచ్చాయి:బన్నీ కంటిన్యూ చేస్తూ.. 'నాకు బేబిలో చాలా విషయాలు నచ్చాయి. కథ రాసిన, తీసిన విధానంతో పాటు డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నుంచి పెర్ఫామెన్స్ తీసుకున్న విధానం నచ్చింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రతి ఒక్కరి పనితనం స్క్రీన్ మీద కనపడింది. అందుకే ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. చిన్న సినిమాలు చూడట్లేదు. గాడిద గుడ్డు చూడట్లేదు. అదేం కాదు.. సినిమాలు బాగుంటే ఎందుకు చూడరు' అని అన్నాడు.

నేను రావడానికి ఆమె కారణం:
ఈ ఈవెంట్‌లో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత.. అందరినీ ప్రశంసించిన తర్వాత.. అల్లు అర్జున్ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 'నేను ఈ ఈవెంట్‌కు రావడానికి ప్రధాన కారణం హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఒక తెలుగు అమ్మాయి ఇలా నటించిందంటే ముచ్చటేసింది. ఆమె డైలాగులు చెప్తుంటే ముద్దొచ్చేసింది' అని ప్రశంసించాడు.

Allu Arjun Invites Telugu Girls to The Film Industry At Baby Appreciation Meet

ఆరోజు ఎప్పుడు వస్తుందని:అల్లు అర్జున్ కొనసాగిస్తూ.. 'అల.. వైకుంఠపురములో మూవీలో వైష్ణవి నాకు సిస్టర్‌గా చేసింది. అప్పుడు ఆమెపై ఫోకస్ చేయలేదు కానీ.. ఇలాంటి తెలుగమ్మాయి హీరోయిన్‌గా చేసే రోజు ఎప్పుడు వస్తుందా అని అనుకున్నాను. అలాంటిది ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో నేను మాట్లాడుతున్నాను. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది' అంటూ వెల్లడించాడు.

అమ్మాయిలకు బన్నీ పిలుపు:ఆ తర్వాత బన్నీ 'ఈ సినిమాకు వైష్ణవికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు శ్రీలీల దుమ్ముదులుపుతుంది. అలాగే తెలుగు అమ్మాయిలే తెలుగు సినిమాల్లో కనిపించాలి. ఈ సందర్భంగా నేను పిలుస్తున్నా రండబ్బా.. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. మీ వాళ్లకు ఇష్టం లేకపోయినా వచ్చి నిరూపించుకోండి' అంటూ పిలుపునిచ్చాడు.

Allu Arjun Invites Telugu Girls to The Film Industry At Baby Appreciation Meet

నాపై ప్రెజర్.. నీకు హ్యాట్సాఫ్:చివర్లో బన్నీ 'అన్ని ఇండస్ట్రీల్లో ఆ భాషల వాళ్లే ఉన్నట్లు తెలుగులో లోకల్ అమ్మాయిలే ఉండాలని అనుకునే వాడిని. కానీ, నాపై ప్రెజర్ ఉండడం వల్ల నా సినిమాల్లో కుదరడం లేదు. అలాంటిది సాయి రాజేష్ ఎంత ప్రెజర్ ఉన్నా వైష్ణవిని తీసుకున్నావు. నీకు హ్యాట్సాఫ్. ఈ విషయం చెప్పడానికి కూడా ఈ ఈవెంట్‌కు వచ్చా. తెలుగు సినిమా తగ్గేదేలే' అని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X