గుడ్ న్యూస్: తండ్రి కాబోతున్న అల్లు అర్జున్!
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రియురాలు స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఇద్దరు కాస్త ముగ్గురు కాబోతున్నారు. మీరు ఊహించింది నిజమే. త్వరలో అల్లు అర్జున్ తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం స్నేహారెడ్డి 5 నెలల గర్భవతి అని తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో స్నేహారెడ్డి కనిపించిందని, ఆ సందర్భంలోనే ఆమె గర్భవతి అనే విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అల్లు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అపీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయం తెలియడంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డిల వివాహం మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.
ప్రస్తుతం బన్ని ప్రస్తుతం 'రేస్ గుర్రం' సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 'రేసు గుర్రం' పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియచేసారు. జనవరి 14,2014న తమ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామని అన్నారు.
శృతిహాసన్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications












