కూలీ నుంచి స్మగ్లర్.. ‘పుష్ప’లో బన్నీ పాత్రపై సెన్సేషనల్ అప్డేట్

ఎప్పుడెప్పుడా అని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మొత్తానికి పుష్ప టీం షూటింగ్‌ను ప్రారంభించేసింది. లాక్డౌన్‌లో పుష్ప టీం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓ మలయాళీ అభిమాని డిజైన్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా ఓరేంజ్‌లో వైరల్ అయింది. ఏకంగా ఆ పోస్టర్ మేకర్స్ దృష్టిని కూడా మరల్చిందంటే పుష్ప ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప చిత్రంపై టోటల్ సౌత్ కన్నేసింది.

మొదటి ప్యాన్ఇండియా..

మొదటి ప్యాన్ఇండియా..

అల్లు అర్జున్ చేస్తోన్న మొదటి ప్యాన్ ఇండియన్ మూవీగా పుష్ప రికార్డులకెక్కబోతోంది. సుకుమార్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ ద్వారా ప్యాన్ ఇండియన్ అంటే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. అందుకు తగ్గట్టే కథను కూడా యూనివర్స్ అప్పీల్ వచ్చేలా డిజైన్ చేశాడు.

ఇంత వరకు రాని కథ..

ఇంత వరకు రాని కథ..

పుష్ప చిత్రం గురించి బన్నీ మాట్లాడుతూ.. ఈ కథ విన్న వెంటనే ఎంతో ఎగ్జైట్ అయ్యాను.. ఇలాంటి పాత్ర, సినిమా ఇంత వరకు రాలేదు. ఎర్రచందన స్మగ్లింగ్ అనే పాయింట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. ఇదో కొత్తపాయింట్.. ఇంటర్నేషన్ అప్పీల్ ఉన్న కథ ఇది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చామని అన్నాడు.

కథ అదే..

కథ అదే..

పుష్ప చిత్రంలోని స్టోరీ లైన్ బయటకు వచ్చేసింది. కూలీగా ఉన్న వ్యక్తి స్మగ్లర్‌గా ఎలా మారాడు.. ఆ తరువాత అతని జీవితంలో ఎదురైన సంఘటనలేంటి అనే ఎమోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతోంది. ఇందులో ప్రతీ పాత్ర సీటు అంచున కూర్చొబెట్టి చూసేలా చేస్తుందని తెలిపారు.

ప్రస్తుతం అక్కడే..

ప్రస్తుతం అక్కడే..

ప్రస్తుతం పుష్ప యూనిట్ మారెడుమిల్లిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోంది. నిన్న మొదలెట్టిన షూటింగ్‌లో బన్నీపై కొన్ని సీన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇదే షెడ్యూల్‌లో రష్మిక మందాన్న కూడా జాయిన్ కాబోతోందోని సమాచారం.

Recommended Video

Anchor Suma Kanakala In Allu Arjun's Movie, Pushpa Unit Reacts
ఎయిర్ పోర్ట్ స్టిల్స్...

ఎయిర్ పోర్ట్ స్టిల్స్...

పుష్ప షూటింగ్ కోసం హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి ఫ్లైట్‌లో బయల్దేరాడు బన్నీ. అలా రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో బన్నీ కోసం వేల మంది అభిమానులు ఎదురూచూశారు. అక్కడ బన్నీ కెమెరా కళ్లకు చిక్కడం , ఆఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X