గాంధీ మార్గంలో అల్లు అర్జున్!
ప్రస్తుతం యువత కట్టలు తెంచుకునే ఆవేశంతో ప్రతి విషయానికి తీవ్రంగా స్పందిచే గుణాల్ని అలవాటు చేసుకుంటున్నారు, కానీ హీరో అల్లు అర్జున్ మాత్రం యువతలో ఆవేశంతో పాటు గాంధీగారి శాంతి భావం కూడా ఉంటుందని నిరూపిస్తున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో తన సినిమా ఆర్య -2 కొందరు తీవ్ర ప్రాంతీయ వాదులు నిలిపివేయడం పట్ల స్పందించిన అల్లు అర్జున్ రెచ్చిపోయుండా శాంతియుతంగా మాట్లాడుతున్నాడు.
సినిమాకానీ ఏ ఇతర కళారూపాలు గానీ ప్రజలందరితో మమేకమై వుంటాయి. ఆకలికి ప్రతి మనిషి ఎలా స్పందిస్తాడో కళా తృష్ణ తీర్చుకోవడానికి అదే తపనతో ఉంటాడు. మా మామయ్య సమైఖ్య వాదానికి సపోర్ట్ చేయడం వల్ల తాత్కాలికంగా ఆవేశానికి లోనయ్యిన కొంతమంది అలా స్పందిచారు.. తప్ప సినిమాలను బ్యాన్ చేయాలని వారు అనుకోవడం లేదు..అంటూ తెలంగాణ వాధుల్ని వెనకేసు కొస్తున్నాడు. ఒక ప్రక్క చిరంజీవికి సంబంధించిన అన్నింటినీ బద్దలు కొట్టి చిరంజీవికి హెచ్చరికలు పంపుతుంటే..ఇతనేంటి గాంధీగారి మాటలు చెపుతున్నాడంటూ అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు.


Click it and Unblock the Notifications











