బన్నీ వేగానికి పిచ్చెక్కిపోయింది.. ఖాళీగా ఎక్కడున్నాడు, హీరోయిన్ పక్కన ఆ ఫోజు చూడండి!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తోంది. కానీ ఇంతవరకు బన్నీ కొత్త సినిమా ప్రకటించలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఉంటుందని, విక్రమ్ కుమార్ కూడా బన్నీతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బన్నీ అధికారికంగా ప్రకటన చేసే వరకు ఈ పుకార్లు ఆగేలా కనిపించడం లేదు. నా పేరు సూర్య నిరాశపరచడంతో ఈ సారి బ్లాక్ బాస్టర్ హిట్ తో అభిమానులని అలరించాలని బన్నీ భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు బన్నీ ఖాళీగా ఉన్నాడు అని భావిస్తే పొరపాటు పడ్డట్లే.

హాట్ హీరోయిన్ ప్రశంసలు
మోడల్, హీరోయిన్ అయిన పరుల్ గులాటి నాగ శౌర్య సరసన నీ జతలేక చిత్రంలో నటించి టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ చిత్రం సరైన విజయం సాధించకపోవడంతో ఈ భామకు మరో అవకావం రాలేదు. పంజాబీ, హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది. తాజాగా పరుల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు జల్లులు కురిపించడం విశేషం.

బన్నీలో మెరుపు వేగం
అల్లు అర్జున్ లో మెరుపు వేగం చూసి తాను మంత్ర ముగ్ధురాలిని అయ్యాయని పరుల్ చెబుతోంది. ఇటీవల అల్లు అర్జున్, పరుల కలసి షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ అని తొందరపడకండి. అది ఓ యాడ్ షూట్. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా పరుల్ బన్నీతో కలసి నటించింది. ఈ సందర్భంగా పరుల్ మాట్లాడుతూ అల్లు అర్జున్ లో మెరుపు వేగంతో పనిచేస్తారు.

డాన్సులు ఎలాగో ఆయన కూడా అంతే
బన్నీ డాన్సులు ఎలా ఉంటాయో ఆయన వర్క్ కూడా అంతే స్పీడ్ గా ఉంటుంది అని పరుల్ చెబుతోంది. వెంటనే పనిలో లీనమైపోతారు. ఆయనతో కలసి సినిమాల్లో నటించలేదు కానీ డాన్సులు చూశాను అంటూ పరుల్ బన్నీని ప్రశంసలతో ముంచెత్తింది. బన్నీతో పరుల్ తీసుకున్న సెల్ఫీ వైరల్ గా మారింది. ఈ సెల్ఫీలో బన్నీ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

వారిద్దరిలో ఎవరు
ఇదిలా ఉండగా బన్నీ తదుపరి చిత్రం ఎవరితో అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. బన్నీ కోసం దర్శకుడు విక్రమ్ కుమార్ కథ సిద్ధం చేసి రెడీగా ఉన్నాడు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో నటించాలని బన్నీ భావిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శత్వంలోని చిత్రం డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











