అల్లు అర్జున్ 'గే'?
అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్, ప్రియాంక చోప్రాల కాంబినేషన్ లో హిందీలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ 'దోస్తానా'. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ లు 'గే' లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించింది. హోమోసెక్స్ గురించి వచ్చిన ఈ కామెడీ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విశ్వసనీయ కథనం ప్రకారం ఇందులో అల్లు అర్జున్, రాజా కథానాయకులుగా నటించే అవకాశం వుంది. అల్లు అర్జున్ అభిషేక్ బచ్చన్ పాత్రలోనూ, రాజా జాన్ అబ్రహమ్ పాత్రలోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఇంకా కథానాయిక ఖరారు కాని ఈ చిత్రం గురించిన కథాచర్చలు జరుగుతున్నట్టు సమాచారం. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సబ్జెక్టును ఎంతవరకూ ఆదరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న...
allu arjun aarya2 kajal sukumar navdeep sradda aarya vedam anushka krish manoj raja అల్లు అర్జున్ ఆర్య2 కాజల్ నవదీప్ శ్రద్దా ఆర్య వేదం అనుష్క క్రిష్ మనోజ్ రాజా


Click it and Unblock the Notifications