అల్లు అర్జున్ తో ప్రొఫెషనల్ రైవర్లీ లేదు
అల్లు అర్జున్ నా క్లోజ్ ప్రెండ్.ప్రతీ విషయం అతనితో నేను డిస్కస్ చేస్తాను. నేను అతను కావాలనుకున్నప్పుడు అలా వాలిపోతాడు. మా బంధం సంవత్సరాల తరబడి బలపడతూ వచ్చింది. ఒక్కసారి అతను ఓ స్క్రిప్టు విని ఆ సినిమా బాగుంటుందనిపిస్తే వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ డైరక్టర్ ని నా దగ్గరకి పంపేస్తాడు.కాబట్టి మా మధ్యన ప్రొఫెషనల్ రైవర్లీ కూడా లేదు అన్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్,బన్నీ ఒకే చోట చిన్నప్పటి నుంచి పెరగటంతో వారిద్దరి మధ్యనా ఓ ప్రత్యేకమైన స్నేహ బంధం నెలకొని ఉంది.ప్రెండ్ షిప్ రోజున రామ్ చరణ్ ఈ విషయాన్ని తెలియచేసారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చలో బిజీగా ఉన్నారు.ఇక బన్నీ త్వరలో త్రివిక్రమ్ తో చిత్రం చేయటానికి సిద్దపడుతున్నారు.


Click it and Unblock the Notifications











