టైటిల్ 'హనీ' కాదంటూ అల్లు అర్జున్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'హనీ'అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అస్సలు ఈ టైటిల్ కీ చిత్రానికి సంభందం లేదని, అస్సలు తాము ఆ టైటిల్ ని కన్సిడర్ చేయలేదని అల్లు అర్జున్ ఖండిస్తున్నారు. అస్సలు ఈ టైటిల్ ప్రచారంలోకి రావటానికి కారణం ఈ చిత్రం నిర్మిస్తున్న నిర్మాత డి.వి.వి దానయ్య. ఆయన పాత బ్యానర్ పై ఈ చిత్రం టైటిల్ ని రిజిస్టర్ చేసారు. అప్పట్లో విజయ్ భాస్కర్ దర్సకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసి ఈ టైటిల్ ని అనుకోవటం జరిగి, రిజిస్టర్ చేసారు. అయితే ఈలోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావటంతో ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఎక్కడా దర్శక,నిర్మాతల కానీ హీరోగానీ ఖండించకపోవటంతో ఈ టైటిల్ కంటిన్యూ అవుతోంది.
ఇక ప్రస్తుతం డివివి దానయ్య ఈ చిత్రాన్ని తన హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టైరేజేషన్ హైలెట్ గా ఉంటుందని చెప్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ భాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇలియానా నటించనుంది. మిగతా ముఖ్యపాత్రల్లో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తణికెళ్ల భరిణి, ఎమ్ ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, సోనూ సూద్, బ్రహ్మాజి, రావు రమేష్, ప్రగతి, తులసి, హేమ తదితరులు నటించనున్నారు. అలాగే సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించనున్నారు. రవీందర్ ఆర్ట్ దర్శకత్వం,పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











