అల్లు అర్జున్ ఇక మీదట స్టైలిష్ స్టార్ కాదు...సిల్వస్టర్ స్టాలిన్....!
బద్రినాథ్ సినిమా కోసం అల్లు అర్జున్ వియత్నాం వెళ్ళి మార్షల్ ఆర్ట్స్ లోని ఓ ఫైట్ ని నేర్చుకొని రావడమే కాకుండా తన బాడీ షేప్ కూడా మార్చుకున్నాడట. అయితే ఈ విషయాన్ని ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి, వినాయక్, చిన్నికృష్ణ ప్రస్తావించారు. రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ వచ్చినా మగధీర కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. బన్నీకి మార్షల్ ఆర్ట్స్ వచ్చినా బద్రినాథ్ కోపసం మళ్ళీ ట్రైనింగ్ తీసుకొన్నాడు. ప్రొఫెషన్ పట్ల తమకి ఉన్న డెడికేషన్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అన్నారు చిరంజీవి.
బద్రినాథ్ సినిమా కోసం ఫైట్ నేర్చుకోవడమే కాకుండా బాడీని బిల్డప్ చేశాడు బన్నీ. ఈ సినిమా తర్వాత అందరూ అతన్ని సిల్వస్టర్ స్టాలిన్ అని పిలుస్తారు అన్నాడు వినాయక్. చిన్నికృష్ణ అయితే ఏకంగా అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీని చూసిన తర్వాత అందరూ అతన్ని సౌత్ హృతిక్ రోషన్ అని పిలుస్తారు అన్నాడు. అల్లు అర్జున్ ని ఈ ఫంక్షన్ లో ఎవరికి వాళ్లు పిలిచేశారు. ఇవన్నీ వింటున్న బన్నీ తనకంత సీన్ వుందా అన్నట్టుగా ఓ నవ్వు నవ్వేశాడు.


Click it and Unblock the Notifications











