ప్రేక్షకులతో చిందేయిస్తోన్న అల్లు అర్జున్
మొన్న ఈ మద్య విడుదలయిన 'ఆర్య 2" పాటలు ఇప్పుడు అంతటా మార్మోగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ మరోసారి బ్రహ్మాండంగా పని చేస్తోంది. అల్లు అర్జున్, కాజల్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆర్య 2" గతంలో 'ఆర్య" లానే సంగీతపరంగా సంచలనం సృష్టిస్తోంది. మెలోడి ప్రధానంగా స్వరపరిచిన ఈ పాటల్లో 'ఉప్పెనంత", 'కరిగేలోగా..", బేబీ హీలవ్స్ యూ", 'మై లవ్ ఈజ్ గాన్" ...ఇలా అన్ని పాటలు వాటికవే ఓ ప్రత్యేకంగా ఉన్నాయి. ఏ పాట బాగుందంటే ఇది ఫస్ట్ ఫిక్ చేయలేనంతగా ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఇక 'రింగా రింగా' పాటయితే ఉర్రూతలూగిస్తోంది. 'మిస్టర్ పర్ ఫెక్ట్" సాంగ్ కూడా టిపికల్ దేవీ బీట్స్ తో చిందేయిస్తోంది. సో ఆడియో బంపర్ హిట్ అవ్వడంతో 'ఆర్య 2" పై అంచనాలు ఆకాశమంత ఎదిగాయి.
ఆర్య2 అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కాజల్ అగర్వాల్ సుకుమార్ arya 2 allu arjun devisri prasad kajal agarwal sukumar


Click it and Unblock the Notifications