సెల్వ డైరెక్షన్ లో శృతి హాసన్ తో రొమాన్స్ చేయనున్నబన్నీ..!
ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'బద్రీనాథ్' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. వీటిలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగు వచ్చే ఆగష్టులో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇందులో అర్జున్ సరసన కమల హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఆమె డేట్స్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూరుస్తాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి ప్లాన్ జరుగుతోంది.
More from Filmibeat
allu arjun selvaraghavan shruti hassan badrinath trivikram srinivas అల్లు అర్జున్ సెల్వరాఘవన్ శృతి హాసన్ బద్రినాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్


Click it and Unblock the Notifications











