నమ్మకం, స్వచ్ఛత, విలువ కోసం...(అల్లు అర్జున్ యాడ్)
హైదరాబాద్ : స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కూడా వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ...బాగా సంపాదించే హీరోల లిస్టులో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోల్గెట్ టూత్ పేస్ట్‌కు, సెవ్ అప్ కూల్ డ్రింక్ తరుపున ప్రచారం చేసిన అల్లు అర్జున్...ప్రస్తుతం 'జోయాలుకాస్' సంస్థ తరుపున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాడు.
ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో యాడ్ చిత్రీకరణ కూడా జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన యాడ్ పోస్టర్లు వివిధ ప్రాంతాల్లో దర్శనం ఇవ్వడంతో పాటు.....వీడియో యాడ్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ''స్వచ్ఛత కోసం మీరు ఎదురు చూసినప్పుడు, నమ్మకం కోసం మీరు అన్వేషించినప్పుడు, వివిధ రకాల కోసం మీరు ఎదురుచూసినప్పుడు, మీరు అందాన్ని ఇష్టపడినప్పుడు. మీరు విలువను కోరుకున్నప్పుడు, మీరు సరైన ధర కోరుకున్నప్పుడు...మనసు చెబుతుంది జోయయాలుకాస్ వెళ్లమని'' అంటూ అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నాడు.
ఇదంతా చూస్తుంటే బన్నీ కూడా యాడ్ ఫిల్మ్ రంగంలో తన సత్తాచాటేందుకు సిద్ధం అవుతున్నారని స్పష్టం అవుతోంది. మరిన్ని కంపెనీలు కూడా అల్లు అర్జున్‌తో డీలింగ్ జరుపుతున్నాయట. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.


Click it and Unblock the Notifications












