HBD Chiranjeevi: చిరంజీవిపై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్.. ఎన్టీఆర్, మహేశ్, పవన్ ఏం చెప్పారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి.. మైలురాళ్లను దాటుకుని.. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక, ఈరోజు చిరంజీవి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!


ఆపద్బాంధవుడు అన్నయ్య
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ 'నా దృష్టిలో అన్నయ్య చిరంజీవి గారు ఆపద్బాంధవుడు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే.. మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో' అని చెప్పారు.

Allu Arjun Jr NTR Mahesh Babu and Other Celebrities Wishes To Megastar Chiranjeevi

ఇదే ట్వీట్‌లో పవన్ 'గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవి గారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నా' అని రాశారు.


మహేశ్ బాబు ఏమన్నాడంటే
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన X (ట్విట్టర్) ఖాతాలో స్పందించాడు. ఈ మేరకు తన ట్వీట్‌లో 'మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎల్లప్పుడూ శాంతి, మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. అలాగే, మీ సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.


నా స్నేహితుడికి శుభాకాంక్షలు
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ట్విట్టర్‌లో 'నా స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు శాంతి, ఆరోగ్యం, సంతోషం ఎల్లప్పుడూ ఇలాగే కలగాలని కోరుకుంటున్నా' అంటూ రాసుకొచ్చారు.


జూనియర్ ఎన్టీఆర్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ బడా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా విషెస్ చెప్పాడు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో 'చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మొత్తం మీకు సంతోషం, సక్సెస్, విజయాలు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నాడు.


అల్లు అర్జున్ ట్వీట్ వైరల్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ - చిరంజీవి అభిమానులు పరస్పరం వ్యతిరేకంగా ట్వీట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఐకాన్ స్టార్ 'చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మళ్లీ మళ్లీ ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Read more about: chiranjeevi allu arjun jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X