అల్లు అర్జున్ ‘జులాయి’ ఫస్ట్ లుక్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలియానా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రానికి 'జులాయి' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అధికారికంగా ఈ నెల 8న బన్నీ బర్త్ డేని పురస్కరించుకుని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించినప్పటికీ...దర్శకుడు రాజమౌళి మైక్రోబ్లాగింగ్ సైట్లో బన్నీ 'జులాయి' పోస్టర్ దర్శనమిచ్చింది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ సరసన తొలిసారిగా గోవా బ్యూటీ ఇలియానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఇటీవల ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని త్రివిక్రం చిత్రీకరించాడు. అందులో అర్జున్, ఇలియానా మధ్య గాఢ చుంబన దృశ్యం కూడా ఉందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. పెళ్లి తర్వాత అర్జున్ పాల్గొన్న తొలి ముద్దు సన్నివేశం ఇదే.
సోసూసూద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పాటలు త్వరలోనే శ్రోతల ముందుకు రానున్నాయి. బన్నీ ఇది వరకు నటించిన 'బద్రీనాథ్' చిత్రం ఊహించిన ఫలితాలను ఇవ్వక పోవడంతో కాస్త వెనకబడ్డ బన్నీ మళ్లీ మాస్ ఆడియన్స్ ను, యూత్‌ను తన వైపు తిప్పుకోవడానికి జులాయి అవతారమెత్తాడు.
అల్లు అర్జున్- ఇలియానా జంటగా చేస్తున్న ఈ చిత్రంలో బన్నీ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పని చేస్తుండటం ఈ చిత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత. డివివి దానయ్య సమర్పణలో హారిక హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











