అందుకే సిక్స్‌ ప్యాక్‌ చేశా:అల్లు అర్జున్

By Srikanya

ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్‌ ప్యాక్‌ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్‌. ఈ రోజు (ఆదివారం) అల్ల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తను చేస్తున్న పదో చిత్రం 'జులాయి' ఈ సమ్మర్ లో అందిర్ని ఎంటర్టైన్ చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇక అల్లు అర్జున్ కి నటుడుగా ఇది పదో పుట్టినరోజు. 2003లో 'గంగోత్రి'తో హీరోగా కెమెరా ముందుకొచ్చారు. 'జులాయి' ఆయనకు పదో చిత్రం. తొలి రెండు చిత్రాల్లో ప్రేమ భావనలు పలికించారు. ఆ తరవాత 'బన్నీ'తో యాక్షన్‌ బాట పట్టారు. 'దేశముదురు'గా యువతరం ప్రశంసలందుకున్న అల్లు అర్జున్ త్వరలో 'జులాయి'గా రానున్నారు.

అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి 'జులాయి' పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. 'జులాయి' విశేషాలను తెలియజేస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటనలో..త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా 'జులాయి' చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికి నాలుగు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫారిన్‌లో పాటలను చిత్రీకరిస్తాం. ఈ నెలాఖరున ఆడియోను, మే నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సోనూసూద్, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మాజి, రావు రమేష్, శ్రావణ్, తులసి, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, నిర్మాణం: హారికా అండ్ హాసిని క్రియేషన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X