కత్రినా కైఫ్, కరీనా కపూర్‌లతో కలిసి అల్లు అర్జున్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, కరీనా కపూర్‌లతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. కొచ్చి లోని ఏమ్మాన్యుయాల్ స్టోర్‌ని ఓపెన్ చెయ్యటానికి కత్రినా మరియు కరీనాలతో పాటు అల్లు అర్జున్ కి కూడా ఆహ్వానం అందింది. మార్చ్ 25న ఈ స్టోర్ ని ప్రారంభించబోతున్నారు. కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అతనికి ఈ అవకాశం దక్కింది.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. బన్నీ త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ చిత్రంలో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి రూపొందించి విడుదల చేయాలనే ఆలోచనలో సెల్వరాఘవన్ ఉన్నట్లు తెలుస్తోంది.
allu arjun shruti hassan katrina kaif kareena kapoor అల్లు అర్జున్ శృతి హాసన్ కత్రినా కైఫ్ కరీనా కపూర్


Click it and Unblock the Notifications