బన్నీకి ఇంతకంటే ఏం కావాలి.. పిల్లలు ప్రేమతోనే షాక్ ఇస్తున్నారుగా.. క్యూట్ ఫొటో
అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక ఫ్యామిలీ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటాడు బన్నీ. ఇక ఆయనకు తోడు సతీమణి స్నేహ రెడ్డి కూడా స్పెషల్ ముమేంట్స్ ని స్టైలిష్ స్టార్ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కేవలం బన్నీ సినిమాల అప్డేట్స్ అనే కాకుండా వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ పోటీలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

పిల్లలే మరో ప్రపంచం
అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ స్టార్ అయినా కూడా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి తన స్టార్ డమ్ ని పక్కన పెట్టేస్తాడు. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా ఫ్యామిలోతో కలిసి హాలి డే ట్రిప్ ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ఇక ఎక్కడైనా అవుట్ డోర్ షూటింగ్స్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే షూటింగ్ లొకేషన్స్ కె పిల్లలను తెచ్చుకోవడం బన్నీకి అలవాటుగా మారింది. ఇక లాక్ డౌన్ లో వారితోనే ఎక్కువగా గడిపాడట బన్నీ.

తెలియకుండానే స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్
బన్నీ కొడుకు ఆయాన్, కూతురు అర్హా సోషల్ మీడియాలో తెలియకుండానే వారికంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నారు. ముఖ్యంగా అర్హా అంటే బన్నీ అభిమానులకు చాలా ఇష్టం. ఈ చిన్నారి ఫొటోలు ఏ ఒక్కటి పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంటాయి. ఇక వీడియోల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అర్హా దిండు అవసరం లేదు
అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా స్నేహ రెడ్డి ఈ అన్నా చెల్లెళ్ళకు సంబంధించిన ఒక క్యూట్ ఫొటోను విడుదల చేశారు. దిండు ఉన్నప్పటికీ అల్లు ఆయన్ పైనే అర్హా తల పెట్టి పడుకుంది. నిజంగా ఆ ఫొటో చూస్తుంటే ప్రేమతోనే షాక్ ఇస్తున్నారుగా అంటూ నెటిజన్లు పజిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాలా క్లియర్ గా అర్ధమయ్యింది
గతంలో కూడా ఇలాంటి ఫొటోలు చాలానే వైరల్ అయ్యాయి. కానీ ఈ ఫొటోలో మాత్రం వారి మధ్య ఉన్న ఆప్యాయత చాలా క్లియర్ గా కనిపించినట్లు అర్ధమవుతోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పాన్ ఇండియా సినిమాగా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆ సినిమా తరువాత బన్నీ కొరటాల శివను సెట్స్ పైకి తెనున్నాడు.


Click it and Unblock the Notifications











