Don't Miss!
- Finance Adani-Birla: అదానీని టార్గెట్ చేసిన బిర్లా.. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కొనుగోలు..
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు అర్జున్ 'వేదం' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ...
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనూష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ (గమ్యం ఫేమ్) రూపొందిస్తున్న 'వేదం' చిత్రం మే నెల ఇరవై తేదిన రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నారు. అనూష్క..వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్ స్టార్ గానూ అలరించనున్నారు. మల్టిఫుల్ నేరేషన్ తో ఏ పాత్రకా పాత్ర మిగతా పాత్రలతో సంబంధం లేకుండా కథనంతో ఈ చిత్ర కథ సాగుతుంది. ఇక ఈ చిత్రంలో మరికొంత మంది హీరోలను గెస్ట్ స్టార్స్ గా చేయటానికి ఒప్పిస్తున్నారు. 'బిందాస్' తో ఓకే అనిపించుకున్న మంచు మనోజ్, ఇప్పటికే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి' చిత్రంలో ఎదిగిన అనూష్క కలిపి చేస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.