ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. తమన్‌పై బన్నీ ప్రశంసలు.. కారణం ఏంటంటే..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఊపు మీదున్నాడు. అల వైకుంఠపురములో వంటి ఇండస్ట్రీ హిట్‌తో మంచి ఫైర్ మీద ఉన్నాడు. తాజాగా తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కూడాక్లిక్ అయింది. అంతా చూస్తుంటే బన్నీకి మంచి కాలం కొనసాగుతూ ఉన్నట్టుంది. బన్నీకి సంతోషాన్ని కలిగించే మరో వార్త వచ్చింది. ఈ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు తమన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

ఇండస్ట్రీ హిట్ వెనుక..
అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడానికి త్రివిక్రమ్ టేకింగ్, అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కారణమే అయినా.. అన్నింటికంటే ముఖ్యంగా తమన్ అందించిన సంగీతమే కారణం. సినిమా రిలీజ్‌కు తన సంగీతంతో బ్లాక్ బస్టర్ అనే టాక్‌ను తీసుకొచ్చి.. సినిమాను ఓ లెవెల్‌లో పెట్టేశాడు.

ఎక్కడ చూసిన అవే పాటలు..
అల వైకుంఠపురములో నుంచి ఒక్కో పాటను రిలజ్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా మొత్తం వణికిపోయింది. ఒకదాని వెంట మరొకటి వచ్చి రికార్డులను బద్దలు కొట్టడంతో యూట్యూబ్‌కు కునుకులేకుండా పోయింది. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ ఇలా ప్రతీ సాంగ్ వంద మిలియన్లను క్రాస్ చేసేసింది.
సినిమా ప్రారంభానికి ముందే..
అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే తనకు బిలియన్ ఆల్బమ్ కావాలని అడిగినట్టు.. తమన్ కూడా ఓకే అన్నాడని పలు ఇంటర్వ్యూల్లో బన్నీ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు తగ్టట్టే తమన్ ఇచ్చిన మ్యూజిక్ దేశమొత్తం ట్రెండ్ అయింది. తాజాగా బన్నీ ఓ ట్వీట్ చేస్తూ తమన్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.
Recommended Video

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్..
అల వైకుంఠపురములో ఆల్బమ్ బిలియన్ మార్క్‌ను రీచ్ కావడంతో తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచున్నాడు. ఈ మేరకు తమన్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘ప్రియమైన సోదరుడు తమన్.. నీ మాటకు నువ్వు కట్టుబడి ఉన్నావ్.. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. సినిమా ప్రారంభానికి ముందు నాకొక బిలియన్ ప్లే అవుట్స్ ఆల్బమ్ కావాలని అడిగాను.. నువ్వు కూడా ఓకే అన్నావ్. ఇప్పుడు 1.13బిలియన్ మంది విన్నారు.. థ్యాంక్యూ..మాట మీద నిలబడ్డావ్'ని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను జీవితాంతం దాచి పెట్టుకుంటానని ట్వీట్ చేసి తమన్ తన ప్రేమను తెలియపరిచాడు.


Click it and Unblock the Notifications











