బన్నీని కూడా రంగంలోకి దింపిన బ్రహ్మీ (ఫోటోలు)
హైదరాబాద్ : బ్రహ్మానందం తన నట వారసుడు రాజా గౌతంను ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అయితే రాజా గౌతంకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుతం రాజా గౌతం నటిస్తున్న 'బసంతి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు హైప్ తేవడానికి తన పలుకుబడి ఉపయోగిస్తున్నారు బ్రహ్మానందం.
ఇటీవల మహేష్ బాబు చేతుల మీదుగా 'బసంతి' మూవీ ట్రైలర్, జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా బసంతి ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల చేయించిన బ్రహ్మానందం.....తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా బసంతి చిత్రంలోని మరో సాంగ్ ట్రైలర్ విడుదల చేయించారు.
త్వరలో జరుగబోతున్న బసంతి మూవీ ఆడియో ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు బ్రహ్మానందం. తనకు అత్యంత ఆప్తులు అయితే తప్ప ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కాని పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం స్వయంగా కోరడంతో 'బసంతి' మూవీ ఆడియో వేడుకకు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

బసంతి
‘బాణం' దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో బ్రహ్మానందం కుమారుడు హీరోగా 'బసంతి' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ టైటిల్ కి A lovestory between a kite and a flight అనే ఇంట్రస్టింగ్ క్యాచీ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

రాజా గౌతం
సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. ‘బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌స అండ్ సైన్స్'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా రాజా గౌతమ్ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.

ఇతర పాత్రలు
ఇతర ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి, షాయాజీషిండే, రణధీర్ గట్ల, నవీన జాక్సన్, డా.కె.ఎస్.ఐ.ఆనంద్, ధన్‌రాజ్, మణి కిరణ్, భాను ఆవిర్నేని, దయ నటిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: కృష్ణ చైతన్య, శ్రీమణి, కెమెరా: అనీల్ భండారి, మాటలు: శ్రీకాంత్ విస్సా, నృత్యాలు: రఘు, ఆర్ట్: రఘు కులకర్ణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ, కధనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య


Click it and Unblock the Notifications











