డ్యాన్స్ ఎంతిష్టమో స్మార్ట్‌ఫోన్ అంతే: బన్నీ సందడి
హైదరాబాద్: తనకు డ్యాన్స్ అంటే ఎంతిష్టమో.. స్మార్ట్ ఫోన్లు అన్నా అంతే ఇష్టమని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్న ఆదివారం అన్నారు. అల్లు అర్జున్న ఈ రోజు రాష్ట్ర రాజధానిలోని అమీర్‌పేటలో లాట్ మొబైల్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, అలాగే స్మార్ట్ ఫోన్లు అన్నా అంతే ఇష్టమన్నారు. వాటిని తాను ఎక్కువగా వాడుతానన్నారు. ఎప్పటికి అప్పుడు టెక్నాలజీ మారుతోందని చెప్పారు. షోరూం ప్రారంభించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనం తరలి వచ్చారు. షోరూం ప్రారంభించాక వారితో కరచాలనం చేస్తూ అల్లు అర్జున్ వెళ్లిపోయారు.
కాగా మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్‌కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఒక్కరోజే హైదరాబాదులో పదిహేను షోరూంలు ప్రారంభమవుతున్నాయని లాట్ మొబైల్ ప్రతినిధులు చెప్పారు.
దీంతో హైదరాబాదులో తమ మొత్తం షోరూమ్స్ సంఖ్య 50 చేరుకుంటుందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా వర్చువల్ వర్చువల్ రియాలిటీలో స్మార్ట్ మొబైల్ ఫీచర్స్‌ను వీక్షించే సౌకర్యాన్ని కల్పిస్తుందని యాజమాన్యం తెలిపింది.


Click it and Unblock the Notifications












