చిక్కుల్లో పడిన ‘అల్లు అర్జున్’

By Sindhu

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'ఆర్య-2" చాలాకాలం నుంచీ నిర్మాణంలో వున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా మీద వచ్చినన్ని రూమర్లు మరే సినిమా మీదా రాలేదేమోననిపిస్తోంది. మొదట్లో టైటిల్ మార్పు చేయాలని కొన్నాళ్ళు, అవసరంలేదని ఇంకొన్నాళ్ళు. ఆ తర్వాత హీరో ఇష్టంలేకపోయినా అదే టైటిల్ ను పెట్టాలనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఇక కొద్ది రోజుల నుండి నిర్మాణం జరుపుకోవడం చూసి అసలు ఈ సంవత్సరం చివరి నాటికైనా ఈ సినిమా విడుదలవుతుందో లేదో అని కొన్నాళ్ళు నిర్మాణం ఆగిపోయిందని ఇంకొన్నాళ్ళు ప్రచారంలోకొచ్చాయి. ఇక ఇప్పుడైతే ఆర్య ట్రాక్ పై పోస్టర్లు నెట్ లో లీకయ్యాయి. అవెలా నెట్ లోకొచ్చాయో అందుకు కారకుడిగా దర్శకుడు నిర్మాతపైనా, నిర్మాత దర్శకుడిపైనా నిందలు వేసుకుంటూ వారం రోజుల పాటు షూటింగ్ కు దూరంగా వున్నట్టు బోగట్టా.

ఇది క్లియర్ అవుతుందన్నంతలో అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పకుండా మొరాయించాడు. కారణం ఏమంటే తనకు తెలియకుండా, తనను సంప్రదించకుండా తనతో ప్రమేయం లేకుండా పోస్టర్లు డిజైన్లను విడుదల చేయడమే అసలైన కారణంగా తెలుస్తోంది. అయితే నెట్ లో వచ్చినవి డూప్ లనీ అసలు డిజైన్లను విడుదల చేయడమే అసలైన కారణంగా తెలుస్తోంది. అయితే నెట్ లో వచ్చినవి ఒరిజినల్ కావని అసలు డిజైన్లు ఇవిగో అంటూ కన్ ఫర్మ చేసుకోవడానికి ఇలా చేశామని సర్థి చెప్పినప్పటికి అల్లు అర్జున్ అలక మానలేదని వినికిడి.

ఓకే ఇతగాడి అలక ఎన్నాళ్ళు వుంటుందిలే అనుకుందాం కానీ దర్శకుడు సుకుమార్ కు ఇంకా పారితోషికం పూర్తిగా ముట్టలేదట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు చేయకుండా మొహం చాటేస్తున్నాడని తాజా సమాచారం. అంటే మొత్తానికి హీరో, దర్శకుడు ఇద్దరూ కలిసి నిర్మాతని లూబిలోకి దింపే ప్రయత్నాల్లో వున్నారన్న మాట!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X