అప్పుడు అల్లు అర్జున్ నిజంగానే ఏడ్చాడు
అల్లు అర్జున్ తాను మైకల్ జాక్సన్ కి వీర ఫ్యాన్ అని..ఆయన మరణవార్త వినగానే ఏడ్చేసానని చెప్పుకొచ్చారు. తన సోదరుడు అల్లు శిరీష్ ఏర్పాటు చేసిన స్టైల్ స్కోప్ అవార్డు పంక్షన్ కి అటెండయిన బన్నీ ఈ విషయం ప్రస్ధావించారు. అంతేగాక స్టేజిపై మైకల్ జాక్సన్ ట్యూన్స్ కి డాన్స్ వేసి అలరించాడు. ఇక తన గదిలో ప్రభుదేవా, మైకల్ జాక్సన్, చిరంజీవి పోస్టర్స్ మాత్రమే ఉంటాయని అన్నాడు. అలాగే ప్రభుదేవాను రిక్వెస్ట్ చేసి మైకల్ జాక్సన్ కి ఎంతో పేరు తెచ్చిన మూన్ వాక్ స్టెప్ ని తనతో పాటు వేయమన్నాడు.వెంటనే ప్రభుదేవా ఆ డాన్స్ లో పాలుపంచుకోవటంతో టప్పట్లు మ్రోగాయి.ఆ రకంగా ఆ స్టేజిపై మైకల్ కి అల్లు అర్జున్ నివాళి అందించారు.
అల్లు అర్జున్ అల్లు శిరీష్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా స్టైల్ స్కోప్ చిరంజీవి మూన్ వాక్ సౌత్ స్కోప్ allu arjun michael jackson cry chiranjeevi prabhu deva cine south


Click it and Unblock the Notifications