»   » 100 మంది ఫైటర్స్ తో అల్లు అర్జున్ ప్రత్యేకంగా...

100 మంది ఫైటర్స్ తో అల్లు అర్జున్ ప్రత్యేకంగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్య మేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాధాకృష్ణ నిర్మాత. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన పోరాటాన్ని డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది. వందల మంది ఫైటర్లతో అల్లు అర్జున్‌ చేసే ఆ పోరాటం ప్రేక్షకుల్ని అలరించేలా ఆ సన్నివేశాల్ని తెరకెక్కించారని తెలిసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ఫైట్ కోసం మూడు కోట్ల ఇంటి సెట్ ని వేసారని అంటున్నారు. 100 ఫైటర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. 'జులాయి' కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. . సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

Allu Arjun locks horn with 100 fighters

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

English summary
Allu Arun is now locking horns with 100 fighters for a stylish and tough action sequences. He is taking part in continuous shooting schedules with director Trivikram and other star cast in Hyderabad. After wrapping the shoot at a 3 cr worth house set, he has now moved onto next.
Please Wait while comments are loading...