twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ అంటేనే ‘మెరుపు’-బన్నీలో చిరంజీవిని చూస్తారు..!

    By Sindhu
    |

    అల్లు అర్జున్, తమన్నా జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం 'బద్రినాథ్". ప్రస్తుతం అందరూ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా ?అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 25వ తారీఖున మార్చి 2010లో ఈ చిత్రం షూటింగ్ ని ప్రారంభించారు. అంటే ఈ చిత్రం షూటింగ్ స్టార్టయి ఇప్పటికి ఇది 15వ నెల. ఈ చిత్రాన్ని ఈ నెల (జూన్ 10)న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి వినాయక్ మాట్లాడుతూ ...

    దైవభక్తి గల ఓ యువకుడికి, దేవుడంటే అస్సలు నమ్మకమే లేని ఓ యువతికి మద్య ప్రేమ ఎలా చిగురించిందనే కాన్సెప్టే ఈ 'బద్రినాథ్".ఈ చిత్రంలో బన్నీ క్షేత్రపాలకుడిగా అద్భుతంగా నటించాడు. బన్నీ ఈ చిత్రంలో తన విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా కత్తి తిప్పే సన్నివేశాలు. ఈ చిత్రానికి ఆయువుపట్టు అని చెప్పడంతో కత్తి తిప్పడం బాగా రావాలని వియాత్నాంలో శిక్షణ తీసుకుని మరీ ఈ చిత్రంలో కత్తి సన్నివేశాల్లో నటించాడు.

    సినిమా మీద అల్లు అర్జున్ కి వున్న ఫ్యాషన్ అంతా ఇంతా కాదనీ, అదంతా 'బద్రిథాథ్" సినిమాలో బన్నీ పడ్డ శ్రమను చూసి ప్రేక్షకులు గుర్తిస్తారని దర్శకుడు వినాయక్ చెప్పుకొచ్చాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవిని తలపించేలా అల్లు అర్జున్ అదరగొట్టేశాడనీ, డాన్సుల్ని ఇష్టపడే ప్రేక్షకులు బన్నీలో చిరంజీవిని చూస్తారని వినాయక్ ధీమా వ్యక్తం చేశాడు..బన్నీ అంటేనే 'మెరుపు" వేగంతో చేసే డాన్సుల్ని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తారనీ వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'బద్రినాథ్"లో డాన్సులుంటాయనీ, సినిమాటోగ్రఫీ, యాక్షన్ వంటి అంశాలు సినిమాకి హైలైట్ అవుతాయంటున్నాడు వినాయక్.

    English summary
    Allu Arjun, VV Vinayak, Allu Aravind and Tamanna 'Badrinath' movie got 'A' certificate from Censor Board. This high budget film is going to release on 10th June 2011 in Telugu, Tamil and Malayalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X