ఇక మీదట అన్ని వైవిద్యభరితమైన చిత్రాలపైనే నా చూపు: అల్లు అర్జున్
నటుడన్న తరువాత అన్ని తరహా పాత్రలు పోషించి మెప్పించాలి. అప్పుడే నటుడిలో ప్రతిభ బైట పడుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను పోషించి అందరిని మెప్పించాలని ప్రతి నటుడికి ఉంటుంది. ఒకే తరహా పాత్రలు పోషిస్తే కొన్ని చిత్రాల తరువాత ఆ నటుడికి ప్రేక్షకుల ఆదరణ ఉండదు. అందుకే అనుకుంట అల్లు అర్జున్ ఈ సారి 'వేదం" లో వైవిద్య భరితమైన పాత్ర పోషించాడు.
ఆర్య2, వరుడు చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కాస్తంత నీరసించిన అల్లు అర్జున్ లేటెస్ట్‌గా వేదం చిత్రంతో కొత్త ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అబ్బాయ్ అర్జున్‌కోసం బాబాయ్ 'పులి" తన సినిమా కొమరం పులి విడుదలను కూడా వెనక్కి వేసుకున్నాడు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తో కలిసి నటించిన వేదం చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
అల్లు అర్జున్, మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్ రూపొందించిన 'వేదం' చిత్రాన్ని ఈ నెల 20న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నాడు. అనుష్క వేశ్యగానూ, మంచు మనోజ్ రాక్ స్టార్‌గానూ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











