అల్లు అర్జున్ LOT మొబైల్ స్టోర్ యాడ్ (ఫోటోలు)
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ వ్యాపార ప్రకటనల రంగంలోనూ తన హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ LOT అనే రిటైల్ మొబైల్ స్టోర్ కంపెనీకి ప్రచారం మొదలు పెట్టారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి.
ఇప్పటికే మహేష్ బాబు యూనివర్శల్ మొబైల్ స్టోర్ తరుపున ప్రచారం చేస్తుండగా........తాజాగా రిటైల్ మొబైల్ స్టోర్ రంగంలోకి దిగిన LOT ఈ రంగంలో పోటీని తట్టుకునేందుకు అల్లు అర్జున్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్లు స్పష్టం అవుతోంది. మరి అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఆ కంపెనీని ఏరేంజికి తీసుకెలుతుందో చూడాలి.
ఇందుకు గాను LOT సంస్థ అల్లు అర్జున్‌తో కోట్ల విలువ చేసే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది...

రూ. 2.5 కోట్ల డీల్..?
LOT సంస్థ అల్లు అర్జున్‍తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు అతనికి సంవత్సరానికి దాదాపు రూ. 2.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ క్రేజ్
సౌత్‌లో అల్లు అర్జున్, అతని నటించే సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఈ క్రేజ్‌ను తమ ఉత్పత్తుల ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి కంపెనీలు. ఇప్పటికే కోల్గెట్ మాక్స్‌ఫ్రెష్, 7అప్, జోయాలుకాస్ లాంటి సంస్థలు బన్నీతో ప్రచారం చేయిస్తున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో యాడ్
LOT సంస్థ త్వరలో క్రిష్ డైరెక్షన్లో అల్లు అర్జున్‌తో ఓ యాడ్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ యాడ్ వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కానుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండో స్థానానికి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ఎక్కువగా ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ.....అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆయన తర్వాతి స్థానంలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్ మరో బ్రాండ్‌కు ప్రచారం చేసే అవకాశం దక్కించుకుని రెండో స్థానానికి ఎగబాకాడు.

అల్లు అర్జున్ రేస్ గుర్రం
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం యూరఫ్ లో జరుగుతోంది. దీంతో పాటు అల్లు అర్జున్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











