ఆ ప్రయత్నం కూడా ముగిసింది.. మహేష్, బన్నీ గొడవ ఎంతదూరం వెళుతుందో!
టాలీవుడ్ లో మళ్ళీవిడుదల తేదీల గొడవ మొదలైంది. అల్లుఅర్జున్, మహేష్ బాబు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతుండడంతో ఇరువైపులా నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెతున్నాయి. కానీ ఆ తేదీని వదులుకోవడానికి మాత్రం ఎవరూ సుముఖంగా లేకపోవడంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొని ఉంది. మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను, అల్లు అర్జున్ నటిస్తున్న నాపేరు సూర్య చిత్రాలు వేసవి సందర్భంగా ఏప్రిల్ 27 న విడుదలకు ముహూర్తం కుదుర్చుకున్నాయి. ఇద్దరు పెద్ద స్టార్ల చిత్రాలుఒకే రోజు విడుదల కానుండడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Recommended Video


సూపర్ హిట్ కాంబినేషన్
మహేష్ బాబు, కొరటాల శివ లది సూపర్ హిట్ కాంబినేషన్. కొరటాల శివ దర్శకతంలో వచ్చిన మహేష్ బాబు చిత్రం శ్రీమంతుడు ఘనవిజయం సాధించింది. భరత్ అనే నేను చిత్రం పై కూడా అదేస్థాయిలో అంచనాలు నెలకొనిఉన్నాయి.

ముఖ్యమంత్రిగా మహేష్
భరత్ అనే నేను చిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆధారం చేసుకుని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈచిత్రంలో కొరటాల మహేష్ ని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు. మహేష్ ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి.

దూసుకుపోతున్న బన్నీ
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. అల్లు అర్జున్ చిత్రాలు వరుస పెట్టి హిట్టు కొడుతున్నాయి. కాగా రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా.

దుమ్మురేపిన ఫస్ట్ ఇంపాక్ట్
దేశభక్తి కథాంశంతో నాపేరు సూర్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ అధికారిగా కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ అభిమానుల్లో ఎలా పేలిందో అందరికి తెలిసిందే. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో టీజర్ అంచనాలు పెంచేసింది.

మహేష్, బన్నీ ఇద్దరూ..
మహేష్ బాబు, అల్లుఅర్జున్ ఇద్దరూ ఏప్రిల్ 27 పై కన్ను వేయడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే ఈ చిత్రాల నిర్మాతలు విడుదల తేదీల్ని ప్రకటించారు. అప్పుడే ఈ అంశం వివాదంగా మారింది.

బన్నీ వాసు అసహనం
నా పేరు సూర్య విడుదలవుతున్న రోజే అల్లు భరత్ అనే నేను చిత్రం విడుదల కానుండడం, రజిని 2.0 కూడా అదే తేదీన విడుదలవుతుందని ప్రచారం జరుగుతుండడంతో నా పేరు సూర్య నిర్మాత బన్నీ వాసు అసహనం వ్యక్తం చేశారు.

ఫలించని ప్రయత్నాలు
భరత్ అనే నేను చిత్ర ప్రొడ్యూసర్ దానయ్య, నా పేరు సూర్య నిర్మాత బన్నీ వాసు మరో మారు కలసి చరించుకున్నారట. అయినా కూడా ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదని టాక్. ఏప్రిల్ 27 ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదట.

ఎఫెక్ట్ తప్పదా
ఇద్దరు బడా హీరోల చిత్రాలు ఒకే రోజు విడుదలైతే రెండు చిత్రాల ఓపెనింగ్స్ పై ప్రభావం తప్పకుండా పడుతుంది. గ్యాప్ లేకుండావిడుదల కావడం వలన గతంలో చాలా చిత్రాలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











