స్పెయిన్లో అల్లు అర్జున్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మార్చి 6న, 2011న అంగరంగ వైభవంగా జరిగింది. నిన్నటితో వీరి పెళ్లయి 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ మ్యారేజ్ డేని బన్నీ తన భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకోలేక పోయాడు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగులో భాగంగా విదేశాల్లో ఉండటమే అందుకు కారణం.
ప్రస్తుతం అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో చేస్తున్నాడు. ఈ షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. దీంతో పెళ్లి రోజును యూనిట్ సభ్యుల సమక్షంలోనే సెలబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అక్కడి వారందరికీ స్వీట్లు పంచాడు.
అల్లు అర్జున్ పెళ్లి ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

స్పెయిన్లో షూటింగు స్పాట్లో అక్కడి వారికి స్వీట్లు పంచుతున్న అల్లు అర్జున్.

స్పెయిన్లో షూటింగు స్పాట్లో అక్కడి వారికి స్వీట్లు పంచుతున్న అల్లు అర్జున్.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వెడ్డింగ్ ఫోటోలు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వెడ్డింగ్ ఫోటోలు.

పెళ్లికి ముందు కొన్ని రోజుల పాటు అల్లు అర్జున్ స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు.

ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వీరు కులాంతర వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్నీ... తన వివాహ వేడుకలో సరికొత్త స్టైల్ తో ఆకట్టుకున్నాడు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వెడ్డింగ్ సందర్బంగా అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి అల్లు అర్జున్ దంపతులు.
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' విషయానికొస్తే.... పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











