డాన్సులు, యాక్షన్ సీన్స్ చేయలేని అల్లు అర్జున్...!

By Sindhu

అల్లు అర్జున్ భుజానికి సర్జరీ చేయించుకోవడానికి పెర్త్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ముగియడంతో అల్లు అర్జున్ పూర్తిగా కోలుకున్నాడట. వచ్చేవారం ఇండియా తిరిగి రావడానికి సమయాత్తమవుతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ఆరంభం కానుందట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా, కాజల్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పెద్దగా డాన్సులు వేసే అవకాశం లేదనీ, యాక్షన్ సీన్స్ కూడా వుండబోవనీ ఇన్ సైడ్ సోర్సెస్ కథనం. ఆర్నెళ్ళపాటు రెస్ట్ తప్పనిసరి కావడంతోనే యాక్షన్, డాన్స్ లు ఎక్కువగా లేకుండా త్రివిక్రమ్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే మొదట మామూలు సన్నివేశాలు పూర్తి చేసేసి, చివర్లో యాక్షన్ పార్ట్స్..పాటలు తీస్తారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో బన్నీ హెల్త్ ప్రాబ్లమ్ సీరియస్ కాదనీ, చిన్నపాటి సర్జరీ మాత్రమే జరిగిందనీ, నెల రోజుల్లో పూర్తిగా నయమవుతుందనీ, మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న టాక్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X