ఆయన గుండె చాలా స్ట్రాంగ్: సర్జరీ తర్వాత బ్రహ్మానందాన్ని కలిసిన అల్లు అర్జున్
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందంకు గుండె సంబంధ సమస్య ఏర్పడటంతో వైద్యులు ఆయనకు సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయి హైదరాబాద్ చేరుకున్న హాస్య బ్రహ్మను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు.
ఈ విషయాన్ని బన్నీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడిస్తూ... ' రియల్ ఐరన్ మ్యాన్.. ఆయన గుండె చాలా స్ట్రాంగ్.. దానికి నవ్వించడమే తప్ప భయం తెలియదు. మా కిల్ బిల్ పాండేను కలవడం సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నారు.

బ్రహ్మానందం సంక్రాంతికి ముందే గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. హార్ట్ సర్జరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వైద్యుడు రమాకాంత్ పండా నేతృత్వంలో వైద్యులు ముంబైలో చికిత్స చేశారు.
సర్జరీ విజయవంతం కావడంతో బ్రహ్మానందం కోలుకుంటున్నారు. ప్రస్తుతం బ్రహ్మీ హైదరాబాద్ చేరుకోవడంతో సినీ ప్రముఖులు ఆయన్ను ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. వైద్యులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో కొంతకాలం బ్రహ్మీ సినిమాలకు దూరంగా ఉంటారని సమాచారం.


Click it and Unblock the Notifications











