»   » అనాధ బాలలను కలిసిన అల్లు అర్జున్ (ఫోటో)

అనాధ బాలలను కలిసిన అల్లు అర్జున్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అనాధ బాలలో బన్నీ ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మంచికలలు అనే ఆర్గనైజేషన్ కు సపోర్టుగా ఉంటున్నారు. అందులో భాగంగానే అనాధ బాలలు బన్నీ కలిసేందుకు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బన్నీ వారిద్దరికీ థాంక్స్ చెప్పారు.

అల్లు అర్జున్ కేవలం షూటింగులకే పరిమితం కాకుండా...పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అదే సమయంలో అభిమానులను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల బన్నీ విజయవాడలో అనారోగ్యంతో బాధపడుతూ తనను చూడాలని కోరుకున్న 64 సంవత్సరాల ఓ అభిమానిని కలిసిన సంగతి తెలిసిందే.

బన్నీ తాజా మూవీ ‘సరైనోడు' వివరాల్లోకి వెళితే...బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. చిత్ర షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత జనవరి 25 నుండి నెక్ట్స్ షెడ్యూల్ జరుగబోతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ‘లోఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని ‘సరైనోడు'లో బన్నీతో స్పెషల్ ఐటం సాంగు చేస్తోంది.

Allu Arjun Meets Orphan Kids

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Sharing the pictures on his social networking page, Allu Arjun wrote, "Met these orphanage children who came to meet me at shoot. Thanks to Fight Masters Ram - Lakshman for supporting the Organisation Manchikalalu."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu