»   » కోరిక తీరింది: కేన్సర్ చిన్నారులతో అల్లు అర్జున్ ముచ్చట్లు! (ఫోటోస్)

కోరిక తీరింది: కేన్సర్ చిన్నారులతో అల్లు అర్జున్ ముచ్చట్లు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేన్సర్ మహమ్మారి భారిన పడి బుతకు పోరాటం చేస్తున్న చిన్నారుల కోరిక తీర్చేందుకు అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. స్వచ్చంద సంస్థ చొరవతో చిన్నారుల కోరిక నెరవేర్చాడు. వారితో సరదాగా గడిపారు. తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు.

హైదరాబాద్ లోని ఎమ్‌ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కేన్సర్ చిన్నారులను అల్లు అర్జున్ బుధవారం కలుసుకుని ముచ్చటించారు. గంట పాటు ఆ చిన్నారులు అల్లు అర్జున్ తో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వారి యోగ క్షేమాలను వైద్యులతో పాటు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు గిఫ్ట్ లు అందజేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.... చిన్నారుల కోసం తన సమయం కేటాయించడం పెద్ద విషయమేమీ కాదని, వారి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు పిలిస్తే తప్పకుండా వెళతానని, తన చేతనైన సహాయం చేస్తానని అల్లు అర్జున్ తెలిపారు.

చిన్నారులతో అల్లు అర్జున్

చిన్నారులతో అల్లు అర్జున్

కేన్సర్ బాధిత చిన్నారులతో ముచ్చటిస్తున్న టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్.

ఆరుగురు

ఆరుగురు

హైదరాబాద్ లోని ఎమ్‌ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కేన్సర్ చిన్నారులను అల్లు అర్జున్ బుధవారం కలుసుకుని ముచ్చటించారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు

క్షేమ సమాచాచం

క్షేమ సమాచాచం

వారి యోగ క్షేమాలను వైద్యులతో పాటు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

గిఫ్టులు

గిఫ్టులు

అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు గిఫ్ట్ లు అందజేశారు

English summary
Tollywood actor Allu Arjun met his fans, who is suffering with cancer in Hyderabad.
Please Wait while comments are loading...