twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ స్టార్ కోసం 200 కిలో మీటర్లు నడిచి.. అభిమాని కలను నిజం చేసిన అల్లు అర్జున్

    |

    అల్లు అర్జున్ ఎవరితోనైనా ఒకేలా ఉంటాడు.. అది అభిమాని అయినా స్నేహితుడు అయినా సరే. ప్రతిభ ఉంటే చేయి అందించి పైకి ఎదిగేలా సాయం చేస్తాడు. కలవాలని వందల కిలోమీటర్ల దూరం కాలినడక వచ్చిన అభిమానిని ఆదరిస్తాడు. సినిమా నచ్చితే దర్శకుడిని పిలిచి మరీ సత్కరిస్తాడు. ఇలా బన్నీ గొప్పదనం, చూపించే ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బన్నీ వరుసగా వార్తల్లో నిలుస్తూ రచ్చ చేస్తోన్నాడు.

    పలాసపై ప్రశంసలు..

    పలాసపై ప్రశంసలు..

    రీసెంట్‌గా పలాస 1978 చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌ను అభినందించాడు. మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. ఈ చిత్రాన్ని చూసిన‌ మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. అంతర్లీనంగా ఓ సందేశాన్ని ఇస్తూనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ చిత్రంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలున్నాయని, వ్యక్తిగతంగా ఎంతో నచ్చింది అంటూ దర్శకుడిని అభినందించాడు.

     మిత్రుడికి విషెస్..

    మిత్రుడికి విషెస్..

    కేదార్ సంగంశెట్టి అనే మిత్రుడు నిర్మాతగా అడుగుపెడుతుంటంతో బన్నీ అభినందించాడు. విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబోలో రాబోతోన్న ఈ మూవీతో తన మిత్రుడు నిర్మాతగా రాబోతోన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని బన్నీ పేర్కొన్నాడు.

    బన్నీ కోసం పాదయాత్ర..

    బన్నీ కోసం పాదయాత్ర..

    బన్నీ ఫ్యాన్ బేస్.. గురించి సౌత్ ఇండియా మొత్తం తెలిసిందే. రెండు తెలుగురాష్ట్రాల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో కేరళలోనూ అదే రేంజ్ క్రేజ్ ఉంది. కొన్ని రోజుల క్రితం బన్నీని చూసేందుకు మాచర్ల నుంచి హైద్రాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చాడు. అభిమాని చేసిన ఈ పాదయాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

    ఆప్యాయ పలకరింపు..

    ఆప్యాయ పలకరింపు..

    తన కోసం 250 కిలోమీటర్లు నడిచి వచ్చిన అభిమానిని బన్నీ ఆప్యాయంగా పలకరించాడు. తన కార్యాలయంతో అభిమానితో కాసేపు ముచ్చటించాడు. అలా అభిమానిని కలను, కోరికను బన్నీ తీర్చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా బన్నీ కురిపించిన ఈ ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    Recommended Video

    Nikhil Siddharth Stylish Look After Marriage
     పుష్ప కోసం..

    పుష్ప కోసం..

    ప్రస్తుతం బన్నీ పుష్ప కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. త్వరలోనే ఓ షెడ్యూల్‌ను ప్రారంభించబోతోన్నట్టు.. అందులో మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేయబోతోన్నట్టు సమాచారం. ప్యాన్ ఇండియన్ స్టార్ కావాలన్న బన్నీ కలులు ఈ చిత్రంతో నెరవేరేలా ఉన్నాయి.

    English summary
    Allu Arjun Met His Fans Who Came On Foot From Macherla, Allu Arjun Praises Karuna Kumar And Palasa movie, Congratulations to the entire team of Palasa 1978. Watched it and met the director the very next morning. Wonderful attempt with a great underlying message. It had so many good moments . I personally liked it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X