నేను ఎందుకు పనికిరాననుకొన్నారు.. కానీ నేను ఈ రోజు అంటూ 10 లక్షల డిపాజిట్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏదైనా సరే చాలా ఓపెన్గా మాట్లాడుతాడు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. ఇక రీసెంట్ గా అల్లు రామలింగయ్య 100 పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా బుక్ లాంచ్ చేశారు. ఇక వేడుకలో బన్నీ స్పీచ్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తాత గారితో నా అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ అలాగే ఆయన కెరీర్ కు ఎంతగానో సహాయం చేసిన వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆ వివరాలలోకి వెళితే..

అల్లు అర్జున్ మాట్లాడుతూ..

అల్లు అర్జున్ మాట్లాడుతూ..

ఈరోజు నేను ప్రత్యేకంగా కొంతమందికి కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను. 1950 నుంచి ఆ లిస్టు మొదలవుతుంది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోకపోతే చాలా తప్పు అవుతుంది. అల్లు రామలింగయ్య గారికి ఫస్ట్ సినిమాతో బ్రేక్ ఇచ్చిన గరికపాటి రాజారావు గారు.. పుట్టినిల్లు సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆయన లేకపోతే ఇవాళ మా జర్నీ మేము ఇలా ఉండేవాళ్లం కాదు అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

కృష్ణ గారితో 200 సినిమాలు

కృష్ణ గారితో 200 సినిమాలు

50 ఏళ్ల కాలంలో అయన ఎంతమంది దర్శకులతో నిర్మాతలతో పనిచేశారు. కానీ కానీ కొంతమంది గురించి చెబుతున్నాను. కానీ ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా హీరోలు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి శోభన్ బాబు గారికి కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. కృష్ణ గారితోనే ఆయన 200 సినిమాలకు పైగా చేశారు. ఇక బ్రహ్మానందం ఆలీ అలాగే మరి కొంతమంది కూడా ఆయనతో వర్క్ చేశారు.

మెగాస్టార్ అల్లుడిగా

మెగాస్టార్ అల్లుడిగా

ఇక ఆయనకు అల్లుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన స్థాయిని ఎన్నో రేట్లు పెంచారు. ఆయన చాలా గొప్ప అదృష్టవంతులు. ఆయనకు మంచి కొడుకు ఉన్నారు. ఇంత మంచి కూతురు పిల్లలు ఉన్నారు. అలాగే ఈ బుక్ ని లాంచ్ చేసిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ పుస్తకం కోసం వర్క్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను.. అని అన్నారు.

అల్లు అర్జున్ కు థ్యాంక్స్

అల్లు అర్జున్ కు థ్యాంక్స్

అలాగే ఇన్ని రోజులు పుట్టినరోజులను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్న మా నాన్నగారు ఏరోజు కూడా వెనుకడుగు వేయకుండా ఇబ్బంది పడకుండా నిర్వహించారు. అలాగే మూడో జనరేషన్ ను కూడా కొనసాగిస్తున్న అల్లు అర్జున్ కు కూడా థాంక్స్ చెప్పాలి అంటూ అల్లు అర్జున్ సరదాగా తెలియజేశాడు. ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నాను అని కూడా బన్నీ వివరణ ఇచ్చాడు.

నేను దేనికి పనికి రాను అనుకొని..

నేను దేనికి పనికి రాను అనుకొని..

ఫ్యామిలీలో ఎవరికి లేని విధంగా నా పేరు మీద 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది. నా ఒక్కడికే ఎందుకు వచ్చింది అని కనుక్కుంటే రామలింగయ్య గారు నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు వేశారు. జీవితంలో వీడు దేనికి పనికిరాడు వీడు 18 ఏళ్ళ వయసులోకి వచ్చిన తర్వాత ఆ డబ్బు వాడి జీవితానికి ఎదో ఊఆ విధంగా ఉపయోగపడుతుంది అని అప్పుడు గొప్ప నమ్మకంతో వదిలేశారు అని అల్లు అర్జున్ సరదాగా వివరణ ఇచ్చాడు. అలాగే ఆయన దృష్టిలో పనికిరాని నేను ఈరోజు ఇలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని కూడా బన్నీ తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X