పుష్ప షూట్ వల్ల బన్నీకి ఎంత కష్టమొచ్చింది.. అలా కాలం గడిపేస్తోన్న స్టైలీష్ స్టార్

అల్లు అర్జున్ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత పెద్ద స్టైలీష్ స్టార్ అయినా కూడా పిల్లల ముందే మాత్రం ఇంకా చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. వారితో కలిసి అల్లరి చేస్తుంటాడు. ముఖ్యంగా అర్హతో బన్నీ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే అయానే ఎక్కువగా ఇష్టమైనా కూడా అర్హతోనే ఇలా అల్లరి చేస్తుంటాడు బన్నీ., దానికి కూడా కారణాలున్నాయని ఈ మధ్యే బయటపెట్టేశాడు.

అయాన్ అలా..

అయాన్ అలా..

అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు, వీడియోలు తీస్తున్నామన్నా కూడా దూరం వెళ్లిపోతాడు. అందుకే ఎక్కువగా అయాన్ సోషల్ మీడియాలో కనిపించడు. కానీ అర్హ మాత్రం అలా కాదు. ఫోటోలు తీస్తామని తెలిస్తే చాలు వచ్చి నా ఒళ్లో కూర్చుంటుంది. నాతో ఉంటే ఫోటోల్లో ఎక్కువగా కనిపిస్తాను అని అర్హకు తెలుసుంటూ బన్నీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అర్హతో సందడి..

అర్హతో సందడి..

అందుకే బన్నీ ఎక్కువగా అర్హతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. బన్నీ అర్హల క్యూట్ వీడియోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించి బన్నీ, అర్హలు పెట్టిన చర్చలు, దాంట్లో బన్నిని అర్హ ఆట పట్టించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకోను అంటూ అర్హ చెప్పే ముద్దు ముద్దు మాటలు తెగ వైరల్ అయ్యాయి.

 దోశ స్టెప్పులు అంటూ..

దోశ స్టెప్పులు అంటూ..

దోశ స్టెప్పులు అంటూ ఆ మధ్య అర్హ చేసిన కామెంట్లు బాగానే వైరల్ అయ్యాయి. రాములో రాములో పాటకు బన్నీ వేసిన మూమెంట్స్‌కు అర్హ దోశ స్టెప్పులు అంటూ పేరు పెట్టేసింది. అలా దోశ స్టెప్పులు అంటూ కామెంట్ చేయడంపైనా బన్నీ తెగ నవ్వేశాడు.

ప్రస్తుతం ఇలా..

ప్రస్తుతం ఇలా..

ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్‌లో ఉండటంతో ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. ఇన్ని రోజులు మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిపారు. ఇకపై కేరళ అడవుల్లోకి మకాం మార్చబోతోన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో బన్ని మరింత కాలం ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది.

Recommended Video

Pushpa : అటవీ ప్రాంతం లో షూటింగ్.. షూటింగ్ స్పాట్ లో విషాదం.. | Allu Arjun
మిస్ అవుతున్నాడట..

మిస్ అవుతున్నాడట..

ఐ మిస్‌ యూ అర్హ అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యాడు. అయితే పాత వీడియోలను చూసుకుంటూ అర్హ అల్లరిని ముద్దు ముద్దు మాటలను గుర్తు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నాడు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన బన్నీ.. అర్హ క్యూట్ మాటలను అభిమానులకు చూపించాడు. అందులో 'బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ'అంటూ బన్నీతో అర్హ ముద్దుముద్దుగా చెప్పడంతో పగలబడి నవ్వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X