అల్లు అర్జున్ కెరీర్, వివాహం గురించి తల్లి నిర్మల...
అల్లు అర్జున్ గురించి అతని తల్లి శ్రీమతి నిర్మల ఓ పాపులర్ తెలుగు మ్యాగజైన్ తో మాట్లాడింది. నా కొడుకు అల్లు అర్జున్ మంచి జిమ్నాస్టిక్స్ ప్లేయర్. ఆ విషయం చాలా మందికి తెలియదు. అలాగే ఏనిమేషన్ కోర్సు పూర్తి చేసాడు. పై చదువులకు కెనడా వెళ్లాలని ప్లాన్ చేసాడు. అయితే గంగోత్రితో అనుకోకుండా హీరో అయ్యాడు. వాడు ఫిల్మ్ స్టార్ అవుతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. మొదటి రోజుల్లో వాడు ఏక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. కానీ వాడి హార్డ్ వర్క్ వాడిని ఈ రోజున ఈ ఉన్నత స్ధితికి తెచ్చింది. మరో విషయం ఏమిటంటే వాడి సినీ కెరిర్ కి ఎక్కడా వాళ్ళ నాన్న పేరు ఉపయోగించలేదు అంది. ఇక అల్లు అర్జున్ పెళ్ళి గురించి మాట్లాడుతూ...బన్నీకి మేం ఫుల్ ప్రీడమ్ ఇచ్చాం. వాడికి నచ్చిన లైఫ్ పార్టనర్ ని వాడు వెతుక్కోవచ్చు. మేం వాడి ఎంపికలో ఎప్పుడూ తలదూర్చం. అయితే ఆ వచ్చే అమ్మాయి మా కుటుంబంలో ఇమిడిపోయేది కావాలనేదే మా కోరిక అంటూ తన మనస్సులోని భావాలను చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











