వైఎస్ జగన్ కోసం అల్లు అర్జున్ సినిమా.. ఈ రూమర్ నమ్మేలా ఉందా?

మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలు చాలా ఐక్యంగా ఉంటారని బయటకు తెలిపినప్పటికి తెర వెనుక మాత్రం మరోలా ఉంటారనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. గతంలో చెప్పను బ్రదర్ అనే కామెంట్ అందుకు ఉదాహరణ అను చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ మెగా అభిమానులకు నచ్చని పని మరొకటి చేయబోతున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

ముఖ్యమంత్రి పాత్రలో..

ముఖ్యమంత్రి పాత్రలో..

ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే కొన్ని మీడియాలలో కథనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బన్నీతో యాత్ర దర్శకుడు మహి వి రాఘవ మాత్రం ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిసార్లు చర్చలు కూడా నడిచాయట. దర్శకుడి స్క్రిప్ట్ పై బన్నీ పాజిటివ్ గా స్పందించిన్నట్లు తెలుస్తోంది.

జగన్ బయోపిక్?

జగన్ బయోపిక్?

ముందుగా ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా రూపొందనుంది ఆమె కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక ప్రస్తుతం అది జగన్ బయోపిక్ అన్నంత రేంజ్ లో టాక్ వైరల్ అవుతోంది. ఇక పూర్తిగా బయోపిక్ లా కాకుండా జగన్ పాత్ర ఆధారంగా అతని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో కథను అల్లారనే టాక్ కూడా వస్తోంది.

పాత్రతోనే కమర్షియల్ కథ

పాత్రతోనే కమర్షియల్ కథ


డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అని తీయకుండా పాత్రను హైలెట్ చేస్తూ కమర్షియల్ కథను రెడీ చేశారనే కథనాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని వీలైనంత త్వరగా బన్నీ టీమ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే బావుంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపి రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్న నేపథ్యంలో సొంత ఫ్యామిలోనే జగన్ కి మద్దతుగా వెళితే బన్నీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Celebrities Green India Challenge
కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు

కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు

అల్లు అర్జున్ నిజానికి పవన్ కళ్యాణ్ ని చాలా వరకు ఇష్టపడతాడు. గత ఎలక్షన్స్ లో ప్రచారాల సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు కదా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే దర్శకుడు మహి వి రాఘవ తన నెక్స్ట్ సినిమాను ఎనౌన్స్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X