అక్కినేనివారి కంపౌండ్‌లో అల్లు అర్జున్!
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బన్నీ హీరోగా వచ్చిన వరుడు చిత్రం ద్వారా భారీ ప్లాపును ఎదుర్కొన్న డీవీవీ దానయ్య... ఈ సినిమాతో కాస్త ఊరట చెందడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా బడ్జెట్ తగ్గించడంలో భాగంగా అల్లు అర్జున్ తో పాటు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు. దీంతో పాటు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు కూడా త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారు.
అల్లు అర్జున్ సరసన ఇందులో ఇలియాన హీరోయిన్ గా నటిస్తుండగా, సోనూ సూద్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం విజయం వంతం కావడం ఇటు అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో పాటు, ఇలియానాకు కూడా చాలా అవసరం. ఇందుకంటే వీరి గత సినిమాలన్నీ తెలుగులో ప్లాపులే. అందుకే చాలా కసితో సినిమా హిట్ కొట్టాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











