రెచ్చగొడుతున్నా రెచ్చిపోని ‘స్టైలిష్ అల్లు అర్జున్’
అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అయితే అయ్యుండచ్చు కానీ మంచి మాస్ హీరోగా మాత్రం ఎన్టీఆర్ అంత ఇమేజ్ తెచ్చుకోలేదు. ఈ విషయం అల్లు అర్జున్ కి తెలుసు అందుకే తనేంటో, తన పనేంటో అన్నట్టు ఉంటాడు. కానీ జనాలు ఉరుకోరు కదా ..ఎన్టీఆర్ స్థాయి అల్లు అర్జున్ ది అని కొంతమంది రెచ్చగొడుతున్నారట. ఈ మాటలు అల్లు అర్జున్ విని నవ్వి ఊరుకుంటున్నాడనే తప్ప రెచ్చిపోవటం తేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన 'ఆర్య- 2" ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'వరుడు", 'వేదం", 'బద్రినాథ్" తదితర చిత్రాలు మంచి కథలతో కూడుకున్నవి. అందుకని వచ్చే యేడాది కూడా సక్సెస్ లో ఉంటానని అల్లు అర్జున్ అంటున్నాడు.
అంతే కాకుండా బాలీవుడ్ లో లాగా మల్టీస్టారర్ సినిమాలు తీయడానికి నేను రెడీ అంటున్నాడు హీరోయిజానికి ఎంత అలవాటు పడినా, ఎప్పుడో ఓ సారి ఇలాంటి సినిమాలు చేయాల్సిందే. తెలుగులోనూ మల్టీస్టారర్ సినిమాలు రావాలి. వాటిని నేనెందుకు ప్రారంభించకూడదు అనిపించింది. పైగా ట్రెండ్ సెట్టర్ గా ఉండాలన్నది నా కోరిక. సిక్స్ ప్యాక్ ను పెంచటంలోనైనా, స్టార్ హోదాను పక్కకునెట్టి నటుగురితో కలిసి పార్టీలకెళ్ళానా ...నా మార్కు ఉండాలని కోరుకుంటాను. మల్టీస్టార్ అనేది కూడా అలాంటిదే. పైగా క్రిష్ అంటే నాకు విపరీతమైన అభిమానం. కథ వినగానే నా పాత్ర నచ్చింది. వెంటనే సినిమా చేయటానికి అంగీకారం చెప్పేశాను. మంచి కథతో వస్తే చరణ్ తో కలిసి నటించటానికి సిధ్దంగా ఉన్నానని అర్జున్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











