బన్నీ మొత్తానికి మొదలెట్టాడు
హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సినిమాకు చాలా రోజుల క్రితమే కొబ్బరికాయ కొట్టేశారు. వచ్చే నెలలో చిత్రీకరణ అన్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ లోగా అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం, యాడ్స్ అంటూ బిజీ అయ్యారు. ఈలోగా త్రివిక్రమ్ చిత్రం స్క్రిప్టుకు పూర్తి స్ధాయిలో మెరుగులు దిద్దారు.

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం జరుగుతున్న కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. జగపతిబాబు, అర్జున్ పేర్లనూ పరిశీలించారు. చివరికి ఉపేంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications











