మే 2 నుంచి అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రం

By Srikanya

హైదరాబాద్ : పూరీ,అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావటంతో ఆయన మరో చిత్రం పై దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం మే 2 వ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రానికి రేసు గుర్రం అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ నటించనుంది. వీరిద్దరూ తొలిసారి కలసి నటించటంతో ట్రేడ్ లో మంచి క్రేజ్ రానుంది. క్రితం సంవత్సరం అక్టోబర్ లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది.

నల్లుమలుపు బుజ్జి, కె వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు అల్లు అర్జున్...ఎవడు చిత్రంలోనూ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X