ఉగాది సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్!
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య' రిలీజ్ అయి దాదాపు సంవత్సరం గడిచిపోయింది. సరైన స్క్రిప్టు దొరక్క పోవడంతో బన్నీ నెక్ట్స్ మూవీ మొదలవ్వడం ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు స్టైలిష్ స్టార్.
అయితే బన్నీ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వివరాలు తప్ప... హీరోయిన్, ఇతర ముఖ్య పాత్రలు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలు ఖరారు కాలేదు. కొన్ని రోజులుగా చిత్ర బృందం ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'ఉగాది' పర్వదినం సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన లాంచింగ్ డేట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు బయటకు వెల్లడిస్తారని సమాచారం.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారట. దర్శకుడి చెప్పిన విధంగా మారడం కోసం అల్లు అర్జున్ స్ట్రిక్ట్ డైట్ మెయింటేన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి స్టైలిష్ స్టార్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ చిత్రాన్ని హారిక హాసిన ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ భారీగా నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











