twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి హ్యాపీ

    By Staff
    |

    Allu Arjun-Gunasekhar
    స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గుణశేఖర్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకోబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభంకానుంది. ఓ కొత్త హీరోయిన్ పరిచయం కానున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసారు. హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య యూనివర్శల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంకి సంగీతం మణిశర్మ అందించనున్నారు. ఆగస్టు కల్లా షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రొడక్షన్ షూటింగ్ డిసెంబర్ 15వ తేది ఉదయం గుణశేఖర్ వ్యక్తిగత కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. రామ్‌ చరణ్ తేజ క్లాప్ కొట్టగా, వి.వి.వినాయక్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు. దేవుని పటాల మీద చిత్రీకరించిన ఈ ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్.రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.

    ఈ చిత్రం గురించి డైరక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ...అల్లు అర్జున్‌ ఇంతవరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా మరో ఎత్తవుతుందని చెప్పారు. యూత్‌లో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్‌ని ఉపయోగించుకుంటూనే నటనా పరంగా ఇది అల్లు అర్జున్ ఒక్కడే చెయ్యగలడు అనిపించేంత పొటెన్షియాలిటితో చాలాపెద్ద రేంజ్‌లో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ఉంటుందని గుణశేఖర్ వెల్లడించారు. దాదాపు ఆరునెలలు పాటు ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగిందని, అలాగే మూడు నెలలు నిరంతరంగా మణిశర్మ సంగీత సారథ్యంలో ఈ చిత్రం మ్యూజిక్ సెట్టింగ్స్ జరిపామని గుణశేఖర్ చెప్పారు. మణిశర్మ కాంబినేషన్‌లో "ఒక్కడు", "చూడాలనివుంది", "అర్జున్" వంటి సినిమాల తర్వాత మరో మ్యూజికల్ హిట్ సినిమా ఇదని గుణశేఖర్ భావిస్తున్నారు. మణిశర్మ తన కెరీర్‌లోనే ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వాలన్న పట్టుదలతో వర్క్ చేస్తున్నారని గుణశేఖర్ తెలిపారు.

    "ఘర్షణ", "గజిని" ఫేం ఆర్.డి.రాజశేఖర్ ఈ చిత్రం స్టోరీ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి, ఈ చిత్రం పూర్తయ్యే వరకు వేరే చిత్రానికి ఫోటోగ్రఫీ చెయ్యకుండా పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నారని చెప్పారు. అలాగే "ఒక్కడు" చిత్రానికి ఆర్ట్ డైరక్షన్ చేసిన అశోక్ మళ్లీ ఓ డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాలో తన ప్రత్యేకతను నిరూపించుకోబోతున్నారని తెలిపారు. రియల్‌లైఫ్‌లోని 50 కుటుంబాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం.

    నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమా గురించి..గుణశేఖర్ వంటి క్రియేటివ్ డైరక్టర్‌తో ఓ భారీ సినిమా తీయాలన్న తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని చెప్పారు. "దేశముదురు" తర్వాత మళ్లీ అల్లు అర్జున్‌తో తమ బేనర్‌లో ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి సంగీతం...మణిశర్మ, పాటలు..వేటూరి, ఫోటోగ్రఫీ...ఆర్.డి.రాజశేఖర్, ఎడిటింగ్...శ్రీకరప్రసాద్, ఆర్ట్..అశోక్, ఫైట్స్...పీటర్ హెయిన్స్, నిర్మాత...డి.వి.వి.దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం..గుణశేఖర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X