అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ‘రేసు గుర్రం’ డీటేల్స్

By Bojja Kumar

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రేసు గుర్రం' అనే టైటిల్ ఖరారైంది. గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే ఇప్పటి వరకు షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన శృతి హాసన్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. తమన్ సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తున్నారు. స్పెయిన్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో అల్లు అర్జున్‌ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, దర్శకత్వం : పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X