అల్లు అర్జున్ తో ట్విస్ట్ లు ఇచ్చేందుకు రెడీఅవుతున్న డైరెక్టర్...!
ఇటీవల ఊసరవెల్లి సినిమాను హిట్ చేసిన సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే మరో సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఈసారి అల్లు అర్జున్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం గోవాలో వున్న సురేందర్ రెడ్డి బన్నీకి సూట్ అయ్యే సబ్జెక్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు.
తన ప్రతి సినిమాలోనూ ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఇచ్చే సురేందర్ రెడ్డి బన్నీ కోసం అలాంటి సబ్జెక్టే రెడీ చేస్తున్నాడట. స్రిప్ట్ ఫైనల్ అయ్యాక బన్నీ వింటారని, బన్నీకి నచ్చే ఎన్నో అంశాలు ఈ స్ర్కిప్ల్ లో వుండడంతో తప్పకుండా అతనికి నచ్చుతుందన్న నమ్మకం సురేందర్ రెడ్డికి వుంది.
కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ సరసన గోవా బ్యూటీ ఇలియానా నటిస్తున్నఈ రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైన్మెంట్ చిత్రం పూర్తిఅవ్వగానే 2012లో సురేందర్ రెడ్డి -అల్లు అర్జున్ కాంబినేషన్ లో హైబడ్జెట్ చిత్రంగా రూపొందనుందని సమాచారం. యాక్షన్ ఓరిఎంటేడ్ సినిమాలను ఒక స్టయిల్ లో రూపొందించడంలో సురేందర్ రెడ్డికి పేరుంది. అలాగే, అల్లు అర్జున్ సినిమాకి కూడా ఓ స్టయిల్ ఇస్తాడని ఆశించవచ్చు. అందుకు తగిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











