ఇక హాఫ్ బీట్ సినిమాల్లో నేను నటించను: అల్లు అర్జున్..!
'వేదం" సినిమా తర్వాత అల్లు అర్జున్ తో అలాంటి సినిమా చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరహా ఆఫ్ బీట్ సినిమాలు చేయడానికిఅ అల్లు అర్జున్ ఓపెన్ గా ఉన్నాడనే సంకేతాలు అందడంతో ఎవరికి వారు తమ తమ దారుల్లో బన్నీని కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే వేదంతో చేతులు కాల్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి ఆ ఒక్కటీ చాలని అంటున్నాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ఆర్య 2, వేదం, బద్రినాథ్ తదితర చిత్రాల్లో తన ఇమేజ్ కి భిన్నంగా ప్రయత్నించి దెబ్బతిన్న అల్లు అర్జున్ ఇకపై సేఫ్ గేమ్ ఆడాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'హానీ' అనే టైటిల్ తో పాటు 'హి ఈజ్ వేరి స్వీట్' అనే క్యాప్షన్ పెట్టనున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా హోల్ సమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాగా అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రాలు కూడా వినోద ప్రధానమైనవే. కొద్ది రోజుల పాటు ప్రయోగాల జోలికి పోనని, అల్టిమేట్ గా కౌంట్ అయ్యేది సక్సెస్ మాత్రమేనని తేల్చి చేప్పేస్తున్నాడట అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











