ఫన్నీ గా బన్నీ : ఇలా తప్పించుకున్నాడు(వీడియో)

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్, రెజీనా కలిసి నటించిన యాడ్ ఇప్పుడు బన్నీ అభిమానులును ఓ రేంజిలో అలరిస్తోంది. హీరోలు నటించిన యాడ్స్ కూడా ఇలా ఆకట్టుకోవటానికి కారణం... ఫన్ గా ఉండటమే. తాజాగా అల్లు అర్జున్ చేసిన OLX యాడ్ అందిరనీ నవ్వులతో ముంచెత్తుతోంది.

ఈ యాడ్ లో...రెజీనా ని ఫ్లయింగ్ కిస్ అడుగుతూంటాడు అల్లు అర్జున్. ఈ లోగా... ఆమె అన్నయ్య అక్కడికి ఓ పాత స్కూటర్ వేసుకుని వస్తాడు. అది చూడగానే రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ...అల్లు అర్జున్ ఎలా తప్పించుకున్నాడో మీరూ చూసి ఎంజాయ్ చేయండి..

ప్రస్తుతం...

మొదటి నుంచీ అల్లు అర్జున్‌.. ఉత్సాహానికి మారు పేరు. చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమికుడిగా, బాధ్యతలు నెత్తికెత్తుకున్న యువకుడిగా, దేశముదురుగా.. ఇలా వివిధ పాత్రలతో అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం ఓకే దానికి సిద్దమవుతున్నాడు. ఈ లోగా సుకుమార్ తో ఓ షార్ట్ ఫిల్మ్..ఇలా ఓ యాడ్ వరసగా చేసుకుంటూ పోతున్నాడు.

Allu Arjun OLX FUNNY Ad

మరో ప్రక్క అల్లు అర్జున్ చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించబోతున్నాడు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్‌ గోన గన్నారెడ్డి చేయటంతో అతని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

కాకతీయుల చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్రకు ప్రముఖ స్థానముంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ఓ వ్యక్తి పాత్ర అది. ఈ పాత్రకు ఎవరు సరితూగుతారా అని ఆలోచిస్తుండగా అల్లు అర్జున్‌ గుర్తొచ్చాడు. పాత్రకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న హీరో అతను. ఈ కథ గురించి చెప్పగానే అతడు కూడా వెంటనే అంగీకరించాడు. దీంతో నేటి తరం హీరోలలో ఇలాంటి పాత్రలు పోషించడానికి నాంది పలికినవాడిగా బన్నీ నిలుస్తాడు.

ఎన్టీఆర్‌కు 'పల్నాటి బ్రహ్మనాయుడు'లా, ఏఎన్నార్‌కు 'తెనాలి రామకృష్ణుడు'లా, కృష్ణంరాజుకు 'తాండ్రపాపారాయుడు'లా, కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు'లా బన్నీకి మా 'రుద్రమదేవి' సినిమా నిలిచిపోతుంది. ఇప్పటికే బన్నీ గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ పొందుతున్నాడు. అతడి సరసన అనామిక దేవిగా కేథరిన్‌ నటిస్తుంది'' అంటూ గుణశేఖర్ చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X