అల్లు అర్జున్ ఫోటోతో కేరళలో పిల్లల పుస్తకాలు
కేరళలో అల్లు అర్జున్ కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. త్వరలో అక్కడ అల్లు అర్జున్ చిత్రం బద్రీనాధ్ విడుదల అవుతోంది. అక్కడ నోట్ పుస్తకాలపై అల్లు అర్జున్ ఫోటోలు వేసి అమ్ముతారు. అంబలాధ్ ప్రొడక్టు వారు ఈ ఫోటోలు వేసి అమ్మటంతో అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అక్కడ కుర్రాళ్లలో అల్లు అర్జున్ అంటే అంతగా ఆసక్తి నెలకొని ఉంది. అల్లు అర్జున్ సినిమాలుకు కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. ఇక వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాధ్ చిత్రం ఇక్కడ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే కేరళలో మంచి రేటుకే ఈ చిత్రం అమ్ముడయినట్లు తెలుస్తోంది. గతంలోనూ అల్లు అర్జున్ చిత్రాలు ఆర్య, హ్యాపీలు అక్కడ ఘన విజయం సాధించాయి.
నిర్మాతలు కూడా అల్లు అర్జున్ తో సినిమా అనగానే కేరళ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఈ అల్లు అర్జున్ ఫోటోతో పుస్తకాలు అమ్మటం అక్కడ మీడియాను సైతం ఆకర్షించింది. వారు ఈ పుస్తకాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసారు. తాము తొలి విడత ప్రింటు చేసిన పుస్తకాలు అయ్యిపోయాయని కొత్త స్టాక్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు పబ్లిషర్లు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామిడీ చిత్రం చేస్తున్నారు. మహేష్ తో ఖలాజా చేసిన తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం ఇదే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











