బన్నీతో అమల కన్‌ఫర్మ్..(ఆమెకు పూరి రిప్లై)

By Bojja Kumar

హైదరాబాద్ : పూరీ జగన్నాధ్, అల్లుఅర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో...'. గణేష్ బండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అమల పాల్ ఖరారైంది. ఈ విషయాన్ని తాజాగా అమల తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

'డాన్సింగ్ స్టార్ బన్నీ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నేను హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆ సినిమాపై ఎంతో ఎగ్జైటెడ్‍‌గా ఉన్నాను' అంటూ అమల పాల్ ట్వీట్ చేసింది.

దీనికి పూరి రిప్లై ట్వీట్ చేస్తూ 'మా యూనిట్ సభ్యులు కూడా నీతో కలిసి పని చేయడంపై ఎంతో సంతోషంగా ఉన్నారు. వీలైనంత త్వరగా హైదరాబాద్ వచ్చేయ్. స్టోరీ వివరిస్తా' పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి గతంలో మీడియాకు వివరిస్తూ దేశముదురు తర్వాత బన్నీ కాంబినేషన్‌లో చేస్తున్న ఈ చిత్రానికి కథ బాగా వచ్చిందని, బన్నీ ఇద్దరమ్మాయిలతో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం ఆయన కెరీర్‌లో విభిన్న చిత్రంగా ఉంటుందని తెలిపారు.

అల్లు అర్జున్ పూరీల మరో సెన్సేషనల్ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తమ సంస్థలో నిర్మించనున్నామని, మరో సూపర్‌హిట్ చిత్రం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఈ చిత్రానికి కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పూరీ జగన్నాధ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X